ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి గంగనీళ్ల జాతర ఆహ్వానం

కలం, నిర్మల్ : సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ గంగనీళ్ల జాతరకు (Ganga neella Jatara) హాజరుకావాలని కోరుతూ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి శుక్రవారం ఆలయ ఈఓ భూమయ్య ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శ్రీనివాస్ శర్మ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.

ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జాతర నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జాతర వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy)ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ తుక్కారం, కౌట్ల (బి) ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు శేఖర్‌గౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : యాదాద్రి పవర్ ప్లాంట్: వెలుగుల వెనుక సంక్షోభం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>