రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి వాకిటి శ్రీహ‌రి

కలం, అలంపూర్‌: తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాల‌ని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం మంత్రి కుటుంబ సమేతంగా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు ప్రసాదం, శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు మరింత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావాలు తగ్గి అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ సరిత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆలయ ఈవో దీప్తి, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>