దసరా నాటికి జూలూరుపాడు టన్నెల్ పూర్తి: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భోజ్య తండాలో నిర్మిస్తున్న జూలూరుపాడు టన్నెల్, పాలేరు లింక్ కాలువ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) సోమవారం పరిశీలించారు. టన్నెల్ పనులను వేగవంతం చేసి వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలన్నారు. పాలేరు లింక్ కాలువ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. భూములు కోల్పోయే రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సుడా ఛైర్మన్ దుర్గాప్రసాద్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>