దళితుల ఓట్లు కావాలి.. గుడిలోకి మాత్రం రావొద్దా?

కలం, వనపర్తి: దళితుల ఓట్లు కావాలి.. కానీ వారు గుడిలోకి మాత్రం రావొద్దా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వివక్షకు చోటెక్కడుందని అఖిలపక్ష ఐక్యవేదిక ప్రశ్నించింది. ఎమ్మెల్యే సొంతూరిలోనే ఆయన మామ దళితుల ఆలయ ప్రవేశానికి అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వస్తే.. సామాన్య ప్రజల సంగతేంటి? అని నిలదీసింది. మంగంపల్లిలో (Mangampally) చోటుచేసుకున్న ఘటనను ఐక్యవేదిక ఖండించింది. ఈ ఘటనపై స్పందించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ యాదవ్ మాట్లాడుతూ.. దళితులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నట్లు తెలిపారు.

గత 40 ఏండ్లుగా..

ఇది ఒక్కరోజు జరిగిన ఘటన కాదని, గత 40 ఏళ్లుగా గ్రామంలోని దళితులకు ఆలయంలోకి ప్రవేశించే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోకి వెళ్లకుండా బయటే ఉండి మొక్కుకోవాలంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఆలయ ప్రవేశానికి ఎందుకు అడ్డంకులు

ఓట్ల కోసం దళితులు.. ఆలయ ప్రవేశానికి మాత్రం అడ్డంకులా? అని నిలదీశారు. నేటికీ దళితులను అంటరానివారిగా చూసే ధోరణి కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఇలాంటి వివక్షాపూరిత చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. మంగంపల్లి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీశ్ యాదవ్, గంధం నాగరాజు, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, బీజేపీ రవి, తిరుపతి నాయక్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>