కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అమరచింత (Amarachintha) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన శ్యామ్ (38) కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం జూరాల ప్రాజెక్టు పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో శ్యామ్ జూరాల ఎడమ కాలువ వద్ద ప్రమాదవశాత్తు జారి కాలువలో పడాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై అమరచింత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గద్వాలకు చెందిన కీర్తనతో అనంతరపురానికి చెందిన శ్యామ్‌కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

