భూత్పూర్ పీహెచ్‌సీలో జిల్లా వైద్యాధికారి త‌నిఖీ

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: భూత్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Bhoothpur PHC) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసీ, ల్యాబ్,వార్డులను పరిశీలించి, రికార్డులను కూడా పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను పెంచాలని ఆదేశించారు. పీహెచ్‌సీ లోప‌ల‌, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆయ‌న వెంట‌ డాక్టర్ అబ్దుల్ రబ్, డాక్టర్ శివకాంత్, శ్రీనివాసులు సిబ్బంది ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>