కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి భారీగా మద్యం లోడుతో వస్తున్న మిని లారీ (Liquor Truck) బోల్తా పడింది. సత్తెనపల్లి పరిధిలోని మేజర్ కెనాల్ బ్రిడ్జి వద్దకు రాగానే అకస్మాత్తుగా టైర్ పగలడంతో అదుపుతప్పింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న మద్యం సీసాలు పగిలిపోయాయి.
మద్యం నేల పాలు కావడంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. లిక్కర్ సీసాలు రొడ్డుపై పగలడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన మద్యం బాటిల్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

