మెస్సీ డబుల్ గోల్.. అట్లాంటాపై ఇంటర్ మయామి విక్ట‌రీ!

క‌లం, స్పోర్ట్స్‌: అట్లాంటా యునైటెడ్‌పై ఇంటర్ మయామి 3–1తో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో గోల్స్‌తో పాటు మరో సన్నివేశం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రత్యర్థి డిఫెండర్ జూనియర్ అలోన్సో ముందు లియోనెల్ మెస్సీ (Lionel Messi) సంబరాలు చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. గత మ్యాచ్‌లో తన ముందు అలోన్సో సంబరాలు చేసుకున్న ఘటనకు మెస్సీ ఇలా బదులిచ్చినట్లు కనిపించింది. సెప్టెంబర్ 5న జరిగిన మ్యాచ్ 2–2తో ముగిసింది. ఆ పోరులో ఇంజ్యురీ టైమ్‌ ఏడో నిమిషంలో మెస్సీ గోల్‌ను అలోన్సో అడ్డుకున్నాడు. అనంతరం మెస్సీ ముందే సంబరాలు చేసుకున్నాడు.

అక్టోబర్ 17న జరిగిన తాజా మ్యాచ్‌లో మెస్సీ ఆ జట్టుపై ఆధిపత్యం చూపించాడు. 45వ నిమిషంలో జర్మన్ బెర్టరామే తొలి గోల్ చేశాడు. 56వ నిమిషంలో మెస్సీ రెండో గోల్ సాధించాడు. మరో మూడు నిమిషాలకే అలోన్సోను దాటుకుంటూ తన రెండో గోల్ నమోదు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్రిగో డి పాల్‌తో కలిసి అలోన్సో ముందు సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ కూడా అందించాడు. వరుసగా మూడు సీజన్లలో కనీసం 15 అసిస్ట్‌లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ఎంఎల్‌ఎస్ చరిత్రలో రికార్డు సృష్టించాడు.

అతడి ప్రదర్శనపై ఇంటర్ మయామి కోచ్ ప్రశంసలు కురిపించాడు. 39 ఏళ్ల వయసులోనూ మెస్సీ ఆట తనను ఆశ్చర్యపరుస్తోందని, ప్రతి మ్యాచ్‌లోనూ అతడి ప్రతిభ కొత్తగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. మెస్సీ సంతోషంగా ఉంటే మరింత అద్భుతంగా ఆడతాడని పేర్కొన్నాడు. ఈ విజయంతో ఇంటర్ మయామి ఈస్టర్న్ కాన్ఫరెన్స్ పట్టికలో 30 మ్యాచ్‌లకు 55 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అగ్రస్థానంలో ఉన్న నాష్‌విల్ ఎస్సీ కంటే 12 పాయింట్లు వెనుకబడి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>