బోనకల్‌లో సీపీఎం స్టడీ సర్కిల్.. పార్టీ సిద్ధాంతాలపై చర్చ

కలం, బోనకల్: సొంత ప్రయోజనాలకంటే పార్టీ సిద్ధాంతాలు, ప్రయోజనాలే అత్యంత కీలకమని సీపీఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం బోనకల్ (Bonakal) మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన స్టడీ సర్కిల్ (CPM Study Circle) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం వెంకటేశ్వరరావు “మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి” అనే అంశంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిజం మహత్తరమైనదని, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పార్టీ లోపల, వెలుపల సాగే పోరాటాల్లో భావజాలపరంగా నిరంతరం తమను తాము సానబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలకు, కార్మిక వర్గ పోరాట ప్రయోజనాలకు తమ ఆలోచనలు సరిపోతున్నాయా లేదా అని నిరంతరం పరిశీలించుకోవాలని తెలిపారు. స్వీయ పరీక్ష ద్వారా అహేతుక భావాల అవశేషాలను తొలగించుకోవాలని, కమ్యూనిజానికి విరుద్ధమైన భావాలను మొగ్గలోనే తుంచివేయాలని సూచించారు. ప్రతి పార్టీ సభ్యుడి వ్యక్తిగత ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలకు లోబడి ఉండాలని ఉద్బోధించారు.

ఈ స్టడీ సర్కిల్‌లో చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, బంధం వెంకటరాజ్యం, బొప్పాల రమేష్, బూర్గుల అప్పచారి, బోయినపల్లి వీరబాబు, గండు సైదులు, కౌసాని సూర్యప్రకాశరావు, గద్దె రామారావు, బిల్లా విశ్వనాథం, కొండేటి అప్పారావు, చామర్తి వెంకటేశ్వరరావు, నల్లమోతు సాయికుమార్, పెద్దప్రోలు కోటేశ్వరరావు, ఏసుపోగు బాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>