ఎమ్మెల్సీగా రాకేశ్​ రెడ్డిని గెలిపించాలి: ప్రభాకర్ రెడ్డి

కలం, మునుగోడు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) అభ్యర్థి రాకేశ్​ రెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్​ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ఉన్న పట్టభద్రులను కలిసి ఎన్నికల్లో పాల్గొనేలా చైతన్యపరచాలని సూచించారు.

ప్రతి ఓటు ఎన్నికల్లో కీలకమని, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ రాకేశ్​ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పట్టభద్రుల సమస్యలు, వారి ఆకాంక్షలను ప్రస్తావిస్తూ అభ్యర్థి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల్లోని పట్టభద్రులను నేరుగా కలిసి మద్దతు కోరాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్​ రెడ్డితో పాటు మాజీ జడ్పీటీసీ సభ్యులు కర్నాటి వెంకటేశం, మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, బీఆర్​ఎస్​ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>