పోలీస్ సేవలను గుర్తించిన ‘లూసియాన’.. కానిస్టేబుల్‌కు అవార్డు

కలం, జగిత్యాల: జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ (Jagtial Police)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నల్లాల విజయ్ కుమార్ సామాజిక సేవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. లూసియానా రీసెర్చ్ యూనివర్సిటీ (అమెరికా) 2026 సంవత్సరానికి గాను సామాజిక సేవా విభాగంలో ప్రదానం చేసే అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.

మహారాష్ట్రలోని పూణేలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు విజయ్ కుమార్ ను మెమెంటో, మెడల్, సీల్డుతో ఘనంగా సత్కరించారు. విజయ్ కుమార్ తన స్వంత ఖర్చులతో నిరుపేద యువకులకు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇప్పించగా, అందులో నలుగురు ఉద్యోగాలు సాధించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థినులకు ప్యాడ్ ల పంపిణీ, గుడుంబా నిర్మూలనలో కీలక పాత్ర పోషించారు.

యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా వారితో మమేకమై క్రీడల వైపు మళ్లించారు. వర్షాకాలంలో దోమల బెడదతో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలకుండా పలు గ్రామాల్లో 40 నుంచి 45 ట్రాక్టర్ల మట్టితో గుంతలను పూడ్చి చదును చేయించారు. అలాగే రోడ్లపై గుంతలను స్వంత ఖర్చుతో పూడ్పించారు. కళాబృందాల ద్వారా గ్రామాల్లో మూఢనమ్మకాలు, అంటరానితనం నిర్మూలన, విద్య ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సేవలకు గాను అవార్డు లభించడం పట్ల పలువురు ఆయనను జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, పలువురు పోలీస్ సిబ్బంది అభినందించారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన యూనివర్సిటీ తెలంగాణ కో-ఆర్డినేటర్ డాక్టర్ కాయితి శంకర్ కు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>