అడెల్లి పోచమ్మ తల్లికి 4 కిలోల వెండి కిరీటం బహూకరణ

కలం, సారంగాపూర్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సారంగాపూర్‌ మండలం కౌట్ల (బి) గ్రామస్తులు అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అమ్మవారికి (Adelli Pochamma Thalli) నాలుగు కిలోల వెండి కిరీటాన్ని బహూకరించారు. బుధవారం గ్రామంలోని సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో వెండి కిరీటాన్ని ఉంచి, భాజాభజంత్రీల నడుమ భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా అడెల్లి ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం అమ్మవారికి వెండి కిరీటాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, దుర్గామాత మాలధారణ భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read :  రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>