రైల్వే ఉద్యోగుల‌కు కేంద్రం పండుగ కానుక!

క‌లం, వెబ్‌డెస్క్‌: రైల్వే ఉద్యోగులకు (Railway Employees) కేంద్రం గుడ్​ న్యూస్​ చెప్పింది. రానున్న దీపావళి సందర్భంగా బోనస్​ (Diwali Bonus) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్​గా ఇవ్వనున్నారు. మొత్తం రూ.2009.61 కోట్లు బోనస్​ రూపంలో ఉద్యోగులకు దక్కనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ బోన‌స్‌ను ఆమోదించారు.

బోన‌స్‌గా రూ.2009.61 కోట్ల మొత్తాన్ని కేటాయించగా ఇందులో గరిష్టంగా ఒక్కో ఉద్యోగికి రూ.17,951 అందనుంది. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు వంటి గ్రూప్ సీ సిబ్బందికి ఈ బోనస్ వర్తిస్తుంది. రైల్వే శాఖలో ఉద్యోగుల సేవ‌ల‌కు గుర్తింపుగా, భవిష్యత్తులో మరింత మెరుగైన పనితీరును కనబరిచేందుకు వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 49,600 మందికి పైగా ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు.

Also Read : రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>