కలం, వెబ్డెస్క్: తన పేరుతో ఫేస్బుక్లో వైరల్ అవుతున్న పోస్టు, మీడియాలో వస్తున్న వార్తలపై కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఈ మేరకు ఆమె అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారం అవుతున్న పోస్టులతో, మీడియాలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన అధికారిక సోషల్ మీడియా తన నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని మీడియాకు, అనుచరులకు, ప్రజలకు సూచించారు. ఈ పోస్టులో తన అధికారిక ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల లింకులను జోడించారు.
ఫేస్బుక్ పోస్టులో ఏముందంటే..?
ఇక నిరీక్షణ ముగిసిందని, త్వరలో రాజకీయ భవిష్యత్తుపై బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నానని, తెలంగాణ ప్రజలంతా తన ప్రకటన కోసం ఎదురు చూడాలని కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్బుక్లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఇది కాస్తా క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీంతో కొండా సురేఖ నుంచి ఏ ప్రకటన వస్తుందోనని అందరూ చర్చించుకున్నారు. ఇదే సమయంలో సురేఖ (Konda Surekha) ఆ పోస్టుపై క్లారిటీ ఇచ్చారు. ఆ ఫేస్బుక్ ఖాతా ఆమెది కాదని స్పష్టం చేశారు.
Also Read : కొండా సురేఖ ఆరోపణల్లో వాస్తవం ఉండొచ్చు: బోయినపల్లి వినోద్
Follow Us On: X(Twitter)

