కొమురం భీం వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 26న జోడేఘాట్‌లో నిర్వహించనున్న కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Adilabad Collector) ఆవిష్కరించారు. వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ నిర్వాహకులు కలెక్టర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు.

అంతకుముందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను గుర్తించి, సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్‌.ఎస్‌. చిత్రు, రాజేశ్వర్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>