ఫ్యూచ‌ర్ సిటీలో క‌మిష‌న‌రేట్ ప్రారంభం!

క‌లం, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు ఈ క‌మిష‌న‌రేట్‌ను నిర్మించారు. దీంతో పాటు సీఎం యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను, శిక్షణ సౌకర్యాలను పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 7–9 తేదీలలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ నిర్వహించనున్న స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, మాస్టర్ ప్లాన్‌లు, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>