బాణసంచా షాపుల లైసెన్సులపై సీపీ కీలక ప్రకటన

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి బాణసంచా దుకాణాల (Firecracker Shops) ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు పేలుడు పదార్థాల నిబంధనల్లోని ఫారం AE-5ను మాన్యువల్‌గా పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు జిల్లా అగ్నిమాపక అధికారి జారీ చేసిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జతచేయాలి. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ అనుమతి పత్రం, ప్రైవేటు స్థలమైతే యజమాని ఎన్‌ఓసీ లేదా అద్దె ఒప్పంద పత్రం సమర్పించాలి.

అలాగే గత ఏడాది లైసెన్స్ ప్రతితో పాటు దుకాణ స్థల ప్రణాళిక బ్లూప్రింట్, జీఎస్‌టీ శాఖ జారీ చేసిన క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ సర్టిఫికెట్ కాపీని జతచేయాలని తెలిపారు. ఖమ్మంలోని కలెక్టరేట్ ఎస్‌బీఐలో రూ.1,500 లైసెన్స్ ఫీజు చెల్లించి, ఆ రసీదును దరఖాస్తుకు జతచేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత డివిజన్ ఏసీపీ కార్యాలయంలో పరిశీలన కోసం అందజేయాలని సూచించారు. అవసరమైన పత్రాలు లేని దరఖాస్తులను తిరస్కరిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. బాణసంచా దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>