భారత్‌పై బీబీఎల్‌ గురి.. చెన్నైలో తొలి మ్యాచ్‌

కలం, స్పోర్ట్స్​ : ఆస్ట్రేలియా గడ్డ దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని బిగ్ బాష్ లీగ్(Big Bash League) ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టోర్నీ చరిత్రలో మొదటిసారి ఆస్ట్రేలియా బయట మ్యాచ్‌లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇందుకోసం భారత్‌ను వేదికగా మార్చుకుంది. ఈ నిర్ణయంపై లీగ్ అధిపతి అలిస్టెయిర్ డాబ్సర్ మాట్లాడుతూ.. బీబీఎల్‌ను ప్రపంచవ్యాప్తంగా చేయడానికి భారత్ సరైన వేదికవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో బీబీఎల్‌-16 తొలి మ్యాచ్‌ జరగనుంది. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, పెర్త్‌ స్కార్చర్స్‌ తలపడనున్నాయి.

టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని డాబ్సన్‌ పేర్కొన్నారు. బీబీఎల్‌ (Big Bash League) ఆస్ట్రేలియాకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవాలనుకుంటోందని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ టీ20 లీగ్‌ల్లో బీబీఎల్‌ కూడా ఒకటని, భారత అభిమానుల మధ్య మ్యాచ్‌ నిర్వహించడం లీగ్‌ గుర్తింపును మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చెపాక్‌లో స్టేడియం నిండా ప్రేక్షకులు వస్తారని క్రికెట్‌ ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది. అయితే, చెన్నైలో డిసెంబర్‌ నెలలో వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్‌ నిర్వహణపై ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై స్పందించిన డాబ్సన్‌.. మ్యాచ్‌కు ప్రత్యేక రిజర్వ్‌ డే ఉండదని స్పష్టం చేశారు.

వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగితే, అవసరాన్ని బట్టి సాధారణ మ్యాచ్‌ల కంటే అదనపు సమయం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.40 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండటం దీనికి కొంత వెసులుబాటు ఇస్తుందని వివరించారు. ఇక మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌) మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించే అంశంపై ప్రస్తుతానికి నిర్ణయం లేదని డాబ్సన్‌ తెలిపారు. ముందుగా ఈ ఏడాది పురుషుల బీబీఎల్‌ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో మహిళల లీగ్‌ మ్యాచ్‌లను ఇతర దేశాల్లో నిర్వహించే అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>