ధర్మానిదే విజయం.. విజయదశమి సందేశమిదే: కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమ విజయం  ధర్మానిదే అవుతుందని.. ఇదే విజయదశమి ఇచ్చే గొప్ప సందేశమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ జీవన విధానంలో, సబ్బండ వర్గాల సంస్కృతీ సంప్రదాయాల్లో దసరాకు ఎంతో విశిష్ట స్థానం ఉందని చెప్పారు.  దసరా స్ఫూర్తితోనే స్వరాష్ట్ర సాధన ఉద్యమం సాగిందని.. ఆ తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టుకు పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుందని పేర్కొన్నారు. మంచిజరుగలని భావిస్తూ  పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొన్నారు. పవిత్రమైన జమ్మి ఆకును ‘బంగారం’గా భావించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ‘అలయ్ బలయ్’ ద్వారా ప్రేమానురాగాలు పంచుకోవడం జరుగుతుందని తెలిపారు.దసరాను గౌరవిస్తూనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జమ్మి చెట్టును ‘రాష్ట్ర వృక్షం’గా, పాలపిట్టను ‘రాష్ట్ర పక్షి’గా అధికారికంగా గుర్తించిందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>