దీపావళి తేదీపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై వివాదం!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరం వెలుగుమట్ల కాలనీలో నూతన నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన తీరు స్థానికంగా, రాజకీయ వర్గాల్లో వివాదంగా మారింది.
​
కాలనీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల, దీపావళి నాటికి వెలుగుమట్ల ప్రజలు కొత్త కాలనీలోనే పండుగ జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ఒక్క నా కొడుక్కీ దీపావళి ఎప్పుడో తెలియదా” అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఒకరు వెంటనే స్పందించి ‘నవంబర్ 8’ అని తెలపడంతో, మంత్రి స్పందిస్తూ “అట్ట కరెక్ట్ గా చెప్పాలంటూ” నవ్వుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. వెలుగుమట్ల కాలనీలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను వేగవంతం చేసి, రాబోయే దీపావళి పండుగను లబ్ధిదారులు తమ నూతన స్వగృహాల్లోనే ఆనందంగా జరుపుకునేలా అధికారులు పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>