కలం, వెబ్‌డెస్క్ : వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను (Nalamasa Srekanth Goud) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్‌కు కవిత(Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కృషి, నాయకత్వ లక్షణాలు, దార్శనికత ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమన్వయం కోసం తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకుడు సయ్యద్‌ను స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా నియమించారు. ఎన్నికల ప్రచారం, సమన్వయ కార్యక్రమాల నిర్వహణలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.

