రేపు ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రిగా డి.కె. శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, జూన్ 3వ తేదీ మధ్యాహ్నం విధానసౌధ, దాని పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సగం రోజు (హాఫ్ డే) సెలవు ప్రకటించింది.

జూన్ 3న మధ్యాహ్నం 4:05 గంటలకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పాటు, ఆయా ప్రాంతాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రత, ప్రజా రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధానసౌధ, వికాససౌధ, బహుళ అంతస్తుల భవనాల్లో (MS Buildings) విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అందరికీ జూన్ 3వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఈ హాఫ్ డే సెలవు వర్తిస్తుందని సిబ్బంది, పరిపాలన సంస్కరణల శాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>