ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి: కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుంటూ, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) పిలుపు నిచ్చారు. శనివారం 31వ డివిజన్ ఖాన్ పురలో స్థానిక కార్పొరేటర్ సయ్యద్ ముఖద్ధర్ హుస్సేన్ అలీతో రూ.50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 31వ డివిజన్ అభివృద్ధికి నూతన పాలకవర్గం ఏర్పడిన కొత్తలోనే నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.12 లక్షలు కేటాయించి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు.

కేంద్రం నుంచి రూ.840 కోట్లు..

ప్రస్తుతం యూఐడీఎఫ్ రూ.50 లక్షల నిధులతో రెండు చోట్ల పైపులైన్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభం చేశామని మేయర్ (Kolagani Srinivas) తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కరీంనగర్‌ నగర అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.840 కోట్లు నిధులు తెచ్చారని తెలిపారు. కుక్కల బెడద సమస్య నివారణకు ఏబీసీ సెంటర్ ప్రారంభించామన్నారు. నగరంలో పశువులను రోడ్లపై వదలకుండా సంరక్షకుల ఆధీనంలోనే ఉంచుకోవాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేసే నీటిని అవసరం మేరకు వాడుకుని ఆఫ్ చేసుకోవాలన్నారు. నగర ప్రజలు స్థలం ఉన్న చోట ప్రత్యేకంగా ఇంకుడు గుంతలను నిర్మాణం చేసుకోవాలన్నారు.

Also Read : ఢిల్లీలో భద్రతపై అమిత్ షా కీలక సమీక్ష

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>