నగర పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్: కరీంనగర్ నగర విస్తరణకు అనుగుణంగా పారిశుధ్యం మెరుగుపరిచి, అభివృద్ధి పనులతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి‌లో భాగంగా బుధవారం కార్పోరేషన్ కార్యాలయ ఆవరణలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, పాలకవర్గ సభ్యులతో కలిసి నగరపాలక సంస్థ‌కు చెందిన రూ. 1 కోటి నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీ, లాడర్ యంత్రాలను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా యంత్రాలను నడిపి వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… నగరంలో ఒకవైపు పారిశుధ్య నిర్వహణ, మరో వైపు అభివృద్ధి సంక్షేమం ద్యేయంగా తమ పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు.

పెరుగుతున్న నగర విస్తరణకు అనుగుణంగా పారిశుధ్య పనులను, వీధి దీపాల నిర్వహణ, ఇతర పరిపాలన కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు నగరపాలక సంస్థ నూతన యంత్రాలను అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. నగర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి కావల్సిన వసతులు కల్పించేందుకు యంత్రాల వినియోగం చాలా ముఖ్యం అన్నారు. నగరపాలక సంస్థ లో చాలా గ్రామాలు విలీనం చెంది జనభాతో పాటు నగర విస్తీర్ణం కూడ పెరిగిందని స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కార్పోరేషన్‌లో అవసరమైన యంత్రాలను వినియోగించడంలో భాగంగా నూతనంగా జేసిబి, లాడర్ యంత్రాలను కొనుగోలు చేశామన్నారు. త్వరలోనే మరో రెండు వైకుంఠ రథాలను కూడ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గతంలో రెండు ఫాగింగ్ యంత్రాలు, 66 ట్రైసైకిల్లు ( రిక్షాలు) కూడ కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు విలీనం చెందాయి కాబట్టి అవసరమైన స్లీపింగ్ యంత్రాలు, డోజర్ తీసుకునే విధంగా పాలకవర్గం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని 66 డివిజన్ల ప్రజల సౌకర్యార్ధం యంత్రాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గ సభ్యుల సహకారంతో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో నగరపాలక సంస్థ ముందు వరసలో ఉందని ప్రజలు మా దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను వేగవంతంగా పరిష్కరించి… ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారంకు తమ పాలకవర్గం కట్టు బడి ఉందన్నారు. మేము అధికారంలోకి వస్తే… డంపింగ్ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన మాట ప్రకారం తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు.

స్వచ్చ్ భారత్ మిషన్ కింద్ 17 కోట్లతో బయోమైనింగ్ ప్రక్రియ‌ను త్వరలోనే ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా గుట్టలుగా పేరుకు పోయిన చెత్తను ప్రక్షాళన చేసే విధంగా అధికారులు, పాలకవర్గ సభ్యులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే డంపింగ్ యార్డు‌ను స్వయంగా సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించామని… పొగ మంటలు రాకుండ తగిన సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి రోజు 150 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డు‌కు చేరుతుందని దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డు లో ఉండగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ను బయోమైనింగ్ చేశామని త్వరలోనే పూర్తిగా డంపు యార్డు ను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారం‌తో కరీంనగర్‌ను అర్బన్ చాలేంజ్ ఫండ్ స్కింలో చేర్చి 840 కోట్లకు ప్రతిపాదనలు చేసి… టెండర్ ప్రక్రియ కూడ పూర్తి చేశామన్నారు.

యూసిఎఫ్ స్కీంలో కూడ ప్రధానంగా డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కొసం 80 కోట్ల నిధులు కేటాయించి ప్రాసెసింగ్ యూనిట్ పద్దతిలో డంపు యార్డు ప్రక్షాళన చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే రెండు నిధులకు సంబంధించిన పనులు ప్రారంభం చేసి రెండు పద్దతుల్లో చెత్తను ప్రక్షాళన చేసి స్థానిక ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియల ద్వారా సంవత్సర కాలంలో చాలా వరకు డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. చాలా ఏళ్ళ నుండి పేరుకుపోయిన చెత్త కాబట్టి ప్రక్షాళన ప్రక్రియను నగరపాలక సంస్థ నిరంతరంగా కొనసాగిస్తుందని ప్రజలు కొంత సంయమానం పాటించాలని కోరారు. నగర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, కరీంనగర్‌ను మోడల్ సీటీగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం, యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>