కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం 20 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అందించారు. అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వాలు గృహా పథకాలను ప్రారంభం చేశాయని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణం కోసం జారీ చేసిన ఈ పత్రాల ద్వారా లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గడ్డి ప్రదీప్, పర్వతం మల్లేషం పాల్గొన్నారు.

