గురుద్వారాలో కరీంనగర్ సీపీ ప్రార్థనలు

కలం, కరీంనగర్ బ్యూరో: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక గురుద్వారాలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Goush Alam) శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని గురుద్వారాలో ప్రత్యేక అర్దాస్ (ప్రార్థనలు) జరిపించారు. గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, టౌన్ మరియు ట్రాఫిక్ సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, గురుద్వారా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>