కమలాపూర్​ ఇన్‌చార్జ్‌ హెచ్ఎంపై సస్పెన్షన్ ​వేటు!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Kamalapur ZP High School)లో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. 2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఈ విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అమర్ సింగ్​ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్​ అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Also Read : కేసీఆర్ పాలనలో ఈ తిప్పలు లేవు: హరీష్ రావు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>