కేసీఆర్ పాలనలో ఈ తిప్పలు లేవు: హరీష్ రావు

కలం, వెబ్ డెస్క్​ : కేవలం అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినంత మాత్రాన రైతన్నల సమస్యలు పరిష్కారం కావని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలు నిలువునా ఎండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం రాబోయే 20 రోజుల పాటైనా అప్రమత్తంగా ఉండి, చేతికొచ్చిన మిగిలిన పంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పల్లెల్లో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ సమస్యలతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారని, గత కేసీఆర్ పాలనలో రైతులకిలాంటి ఇబ్బందులు ఎప్పుడూ రాలేదని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కరువు మండలాలను అధికారికంగా ప్రకటించాలని, అలాగే పంటలు ఎండిపోయి నష్టపోయిన ప్రతి రైతుకూ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఇన్ స్టాలోకి సోనియా గాంధీ.. స్పెషల్ రీల్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>