ఇంద్రవెల్లిలో కవిత భారీ సభ.. ఎప్పుడంటే?

కలం, వెబ్ డెస్క్: వినూత్న శైలిలో తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. పార్టీ క్షేత్ర స్థాయి బలోపేతం దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులను తిప్పికొడుతూ.. తెలంగాణ హక్కులపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే మరో కొత్త సభకు కవిత శ్రీకారం చుట్టారు. ఈనెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో నాయకులు పోస్టర్ రిలీజ్ చేశారు.

పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కోస్గి (కొడంగల్)లో పాంచజన్య సంకల్ప సభలు జరిగాయి. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభను ఆదివాసీల ఆత్మగౌరవ పోరు పతాక ఇంద్రవెల్లి స్తూపం సాక్షిగా నిర్వహిస్తున్నారు. ఈ సభా వేదికగా పార్టీ ప్రధాన ఎజెండా అయిన పాంచజన్యం హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సభ నిర్వహణకు మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ నాయకుడు కావేటి మనోహర్ ను ఇన్ ఛార్జీలుగా నియమించారు. అలాగే పలువురు పార్టీ సీనియర్ నాయకులకు సభ బాధ్యతలు అప్పగించారు.

Also Read : కేటీఆర్ హెయిర్ ప్లాంటేషన్‌పై బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>