కలం, ఆదిలాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియమానికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector) స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల నియమాకానికి దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థులకు బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షి షా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని, వాటిని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం టీచర్, హెల్పర్ నియామకాలను చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి అభ్యర్థికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టామన్నారు.
ఇంద్రవెల్లి (Indravelli) మండలంలో 9 టీచర్ పోస్టులకు అర్హత సాధించిన 56 మందిలో 48 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఎంపిక ప్రక్రియలో పూర్తిగా మెరిట్, నిబంధనలకే పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, DWO మిల్కా, DHMEO డా.సాధన, గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణ అధికారి జగన్, సీడీపీఓలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇంద్రవెల్లిలో కవిత భారీ సభ.. ఎప్పుడంటే?
Follow Us On : WhatsApp

