స్విట్జర్లాండ్ అంబాసిడర్‌గా జెమీమా!

కలం, స్పోర్ట్స్​ : భారత మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) కు మరో కీలక బాధ్యత లభించింది. స్విట్జర్లాండ్ టూరిజం ఆమెను భారత్‌కు ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్విట్జర్లాండ్ టూరిజం సీఈవో మార్టిన్ నైడెగర్ ప్రకటించారు. స్విట్జర్లాండ్ పర్యాటక మార్కెట్లలో భారత్ టాప్‌-10లో ఉందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా శరదృతువు(ఆటమ్), శీతాకాలంలో భారత పర్యాటకుల సంఖ్యను పెంచడమే ఈ ప్రచారం లక్ష్యం.

ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య ప్రయాణాలపై ఎక్కువగా ఉన్న దృష్టిని ఏడాది పొడవునా విస్తరించాలని భావిస్తోంది. ఈ కొత్త బాధ్యతపై జెమీమా సంతోషం వ్యక్తం చేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని తెలిపింది. స్విట్జర్లాండ్‌లో కొత్త ప్రదేశాలను సందర్శించి, విభిన్న అనుభవాలను పొందాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఆ అనుభవాలను భారతీయులతో పంచుకోవడం ఆనందంగా ఉంటుందని వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>