జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై నేడు ఈటల రౌండ్ టేబుల్ సమావేశం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర శివార్లలో తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యగా మారిన జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు, ప్రక్షాళనను డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించే దిశగా పర్యావరణవేత్తలు, వివిధ రంగాల మేధావులతో కలిసి హైదరాబాద్ వేదికగా నేడు ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న విషవాయువులు, లీచేట్ వల్ల దమ్మాయిగూడ, నాగారం, కీసర పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర శ్వాసకోశ, పర్యావరణ దుష్పరిణామాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.

డంపింగ్ యార్డ్ వల్ల లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దుర్వాసన, కాలుష్యం లేకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, యార్డు తరలింపు లేదా సమర్థవంతమైన నిర్వహణను సాధించడమే లక్ష్యంగా ఈనెల 27 నుంచి భారీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, పర్యావరణ సంస్థలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>