జలమండలి కఠిన నిర్ణయం.. ట్యాంకర్లకు జరిమానా!

కలం, తెలంగాణ బ్యూరో: తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి (Jalamandali) కఠిన చర్యలకు సిద్ధమైంది. కొన్ని ట్యాంకర్లలో సామర్థ్యానికి మించి నీటిని నింపడం, మూతలు లేకపోవడం, సరిగ్గా మూసివేయకపోవడం వల్ల రవాణా సమయంలో రహదారులపై నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నీటి వృథాకు పాల్పడిన ట్యాంకర్ యజమానులకు నవంబర్ 1 నుంచి రూ.5 వేల జరిమానా విధించనుంది.

రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ట్యాంకర్ రిజిస్ట్రేషన్ను రద్దు చేయనుంది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి శనివారం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్యాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలు, మూతల పరిస్థితిని పరిశీలించాలని ఫిల్లింగ్ స్టేషన్ల మేనేజర్లు, ఇన్చార్జ్లను ఆదేశించారు. లోపాలుంటే వాటిని సరిచేసే వరకు నీటిని నింపరాదని స్పష్టం చేశారు. నిబంధనల అమలును సంబంధిత డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు పర్యవేక్షించాలని సూచించారు. ట్యాంకర్ అసోసియేషన్లు తమ సభ్యులకు అవగాహన కల్పించి నీటి వృథా నివారణకు సహకరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>