కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన పాములు రవి అనే యువకుడు (Itikyal Youth) ఈ నెల 19న దుబాయ్‌లో మృతి చెందాడు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ స్పందించి, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) దృష్టికి తీసుకెళ్లారు. రవి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

