వన్డే సమరానికి భారత్‌ రెడీ.. హర్మన్‌ప్రీత్‌పై ఫోకస్‌!

క‌లం, స్పోర్ట్స్‌: టీ20 సిరీస్‌లో జింబాబ్వేను 3–0తో ఓడించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌ (ODI Series)పై కన్నేసింది. శుక్రవారం తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. కొత్త కెప్టెన్‌ స్మృతి మంధాన(Smriti Mandhana)కు ఇది పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా తొలి సిరీస్‌. భారత్‌ విజయాల్లో మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫామ్‌లోకి రావడం కీలకం. చివరి టీ20లో ఆమె 41 బంతుల్లో 91 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని జట్టు భావిస్తోంది. మరోవైపు, గాయంతో జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్‌ స్థానాన్ని భర్తీ చేయడం భారత్‌కు సవాలుగా మారింది.

మూడో స్థానంలో హర్లీన్‌ డియోల్‌, ప్రతీక రావల్‌ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ స్థానంలో ఎవరు రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లోనూ భారత జట్టుకు బలం ఉంది. టీ20 సిరీస్‌లో జింబాబ్వే ఓడినా కొన్ని అంశాల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ జట్టు ఫీల్డింగ్‌ ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో షార్నే మేయర్స్‌ రాణించింది. చివరి టీ20లో 60 పరుగులు చేసింది. బౌలింగ్‌లో బెలవ్డ్‌ బిజా ఆరు వికెట్లు తీసి సత్తా చాటింది.

Also Read : విజృంభించిన సంజూ.. కివీస్‌పై భారత్ ఘన విజయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>