హైదరాబాద్‌లో ఘోర కారు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ లోని కాంచన్‌‌బాగ్ (Kanchanbagh) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర కారు ప్రమాదం (Car Accident) జరిగింది. బాబా నగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక మహీంద్రా కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు గాల్లోకి లేచి కింద రోడ్డుపై పల్టీలు కొట్టింది.

ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వాహనం బోల్తా పడిన వెంటనే కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించేందుకు కాంచన్‌బాగ్ పోలీసులు (Kanchanbagh Police) సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>