కలం, వెబ్‌డెస్క్: ఆదివారం లేదా పండుగ రోజుల్లో ఇళ్లల్లో చికెన్, మటన్ కర్రీస్ వండుతుంటాం. అది కాస్తో కూస్తో మిగిలిపోవడం సర్వసాధారణం. అలా మిగిలిపోయిన చికెన్ కూర (Cooked Chicken) ను పారేయడం ఇష్టం లేక, చాలామంది వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. మరుసటి రోజు లేదా రెండు మూడు రోజుల తర్వాత కూడా దాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. చికెన్, మటన్ వృథా కాకుండా ఉండటానికి మనం చేసే ఈ చిన్న పని మన జీర్ణవ్యవస్థపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిల్వ పద్ధతి మారితే ముప్పే
గరిష్ట కాలపరిమితి ఎంత?
అయితే మూడు రోజుల తర్వాత ఆహారం బయటకు బాగానే కనిపించినా, అందులో హానికరమైన సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం ఉంటుందట. వండిన నాన్‌వెజ్‌ను నిల్వ చేసేటప్పుడు ఫ్రిజ్ ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది. ఫ్రిజ్‌ను 5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఈ ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియా పెరుగుదల కొంతవరకు నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజర్‌లో పెట్టాలని సూచిస్తున్నారు.
ఫ్రిజర్ ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఇలా చేస్తే ఆహారం ఎక్కువకాలం సురక్షితంగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టే ముందు వండిన మాంసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అయితే ఎక్కువసేపు బయట ఉంచకూడదు. సాధారణంగా వండిన రెండు గంటలలోపు ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. ఆహారాన్ని ఎయిర్‌టైట్ కంటైనర్లలో నిల్వ చేస్తే రుచి, నాణ్యత ఎక్కువకాలం ఉంటుంది. అలాగే ఇతర ఆహార పదార్థాల నుంచి వాసనలు కలవకుండా ఉంటుంది.
ఫ్రిజర్‌లో నిల్వ చేసిన చికెన్ లేదా మటన్‌ను ఉపయోగించే ముందు సరైన విధంగా డిఫ్రాస్ట్ చేయాలి. నేరుగా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి కరిగించడం మంచిది కాదు. ఫ్రిజర్ నుంచి తీసి ఫ్రిజ్‌లో కొన్ని గంటలు లేదా రాత్రంతా ఉంచితే నెమ్మదిగా కరుగుతుంది. పూర్తిగా కరిగిన తర్వాత 24 గంటల్లోపు వాడేయాలి. ఒకసారి కరిగించిన ఆహారాన్ని మళ్లీ ఫ్రిజర్‌లో పెట్టకూడదు. లేదంటే తినే ముందు తీసి కాసేపు బయటపెట్టిన తర్వాత వేడి చేయాలి.

