కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.382 కోట్లు మంజూరు చేసిందని కుడా ఛైర్పర్సన్ గుండు సుధారాణి (Gundu Sudharani) పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ నిధులతో వరంగల్ కోట కందకాల పునరుద్ధరణ, హనుమకొండ సెంట్రల్ ప్లాజా అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం, వేయిస్తంభాల గుడి పరిసరాల అభివృద్ధి, మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు చేపట్టనున్నారు. ఇవి పూర్తయితే నగరంలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించడంతోపాటు వాణిజ్య కార్యకలాపాలు, స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సుధారాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

