కలం, కరీంనగర్: హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలో ఇటీవల PACS చైర్మన్‌గా నియమితులైన చిట్టుమల్ల రవీందర్ తో పాటు నూతనంగా నియమితులైన సభ్యులు హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన PACS చైర్మన్, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమను బాధ్యతల్లోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన PACS చైర్మన్ చిట్టుమల్ల రవీందర్ తో పాటు సభ్యులను అభినందించారు. రైతుల సంక్షేమం, సహకార రంగం బలోపేతం కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
PACS ద్వారా రైతులకు అవసరమైన సేవలు మరింత మెరుగ్గా అందేలా కృషి చేయాలని, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి ఆకాంక్షించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతుల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

