సాయికృష్ణ డెత్ కేసు: రంగంలోకి సీబీఐ!

కలం, వెబ్ డెస్క్ : గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ఘటనపై సీబీఐ అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన సాయికృష్ణ మృతి ఉదంతంపై ఆధారాలు, రికార్డులను సేకరిస్తూ సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఉన్నత న్యాయస్థానం జోక్యంతో కేసు విచారణ కేంద్ర ఏజెన్సీ చేతికి మారడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయికృష్ణ మృతికి గల అసలు కారణాలు ఏమిటి, ఈ ఘటనలో ఎవరి పాత్ర ఎంతుందనే కీలక అంశాలు సీబీఐ సమగ్ర విచారణలో వెలుగులోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>