సారపాకలో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి 4 వాహనాల బ్యాటరీలు మాయం!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka) ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై, ఇళ్ల ముందు వాహనాలను నిలిపి ఉంచాలంటేనే యజమానులు ఆందోళన చెందే దయనీయ పరిస్థితి నెలకొంది. తాజాగా సారపాకలోని భాస్కర్‌ నగర్‌లో ముత్యాలమ్మ గుడి సమీపంలో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడి సమీపంలో నిలిపి ఉంచిన నాలుగు భారీ వాహనాల బ్యాటరీ బాక్సులను దొంగలు పగులగొట్టి, లోపల ఉన్న విలువైన బ్యాటరీలను (Vehicle Batteries Stolen) ఎత్తుకెళ్లారు.

ఉదయం వాహనాలను స్టార్ట్ చేయడానికి వచ్చిన డ్రైవర్లు, యజమానులు.. బ్యాటరీలు కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ఒకే రాత్రి నాలుగు వాహనాల బ్యాటరీలు మాయమవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వాహనాలే జీవనోపాధిగా బతుకుతున్న తమకు, ఈ విలువైన బ్యాటరీల చోరీ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
​
ఒకేసారి నాలుగు వాహనాల బ్యాటరీలు చోరీకి గురికావడంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సారపాక పరిసర ప్రాంతాల్లో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని వారు గట్టిగా కోరుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను వెంటనే గుర్తించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చోరీలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>