కలం, జోగులాంబ గద్వాల: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ధరూర్ ఎస్ఐ తారక తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్చర్ల (Parchela) గ్రామశివారులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో మేరకు ధరూర్ పోలీసులు దాడి చేశారు. అక్కడ నలుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.72,830 నగదు, 2 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

