కలం, వెబ్ డెస్క్: ఏపీలోని సత్యసాయి జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. పెనుకొండ (Penukonda)లోని గొల్లపల్లి రిజర్వాయర్ లో స్నానం చేయడం కోసం దిగి ఐదుగురు మహిళలు మృతి చెందారు. నీటి లోతు తెలియక పోవడంతో లోపలికి వెళ్లి బురదలో చిక్కుకుని ఒక్కొక్కరుగా నీట మునిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి చర్యలు వేగవంతం చేశారు. పలువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమ తల్లుల కోసం చిన్నారుల ఎదురుచూడటంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
Also Read : స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవు: అమర్నాథ్
Follow Us On: Instagram

