బ్యాలెట్ బాక్స్ బయట ఎలా?.. నల్లగొండలో చర్చ

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో పాత ఇనుప సామాను దుకాణంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన బ్యాలెట్ బాక్స్ లభించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరుస్తారు. అలాంటిది అత్యంత నిఘా ఉండే ఈ బ్యాలెట్ బాక్స్ పాత ఇనుప సామాను దుకాణంలో ప్రత్యక్షం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భూపాలపల్లి నుంచి ఇక్కడకు..

బాక్స్‌పై ఉన్న వివరాల ఆధారంగా ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది. మరి, అక్కడ ఉండాల్సిన బాక్స్ నల్లగొండలోని స్క్రాప్ దుకాణానికి ఎలా చేరిందనేది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాలెట్ బాక్స్‌ను కట్టర్‌తో కోసిన ఆనవాళ్లు ఉండటంతో ఏదైనా అక్రమం జరిగిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దుకాణ యజమాని వివరాల ప్రకారం.. మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తి ఈ బ్యాలెట్ బాక్స్‌ను స్క్రాప్ కింద తనకు విక్రయించినట్లు తెలిపారు. కలెక్టరేట్ సమీపంలోనే ఈ ఘటన వెలుగు చూడటంతో జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>