కలం, వెబ్ డెస్క్: దసరా (Dussehra) పండుగ నేపథ్యంలో సిటీ జనాలు సొంతూరి బాట పడుతున్నారు. దీంతో నగరంలోని రోడ్లు ఖాళీగా దర్శనమిస్తుండగా, శివారు పరిధిలోని రోడ్లు, ముఖ్యంగా విజయవాడ-హైదరాబాద్ రోడ్లు రద్దీగా మారాయి. చౌటుప్పల్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు పెద్దఎత్తున బారులు తీరాయి.
దీనికి తోడు పలువురు వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పండుగ వేళ వాహనాల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే హైవేలు, ప్రధాన నగరాలు రద్దీగా ఉండటంతో ప్రయాణికులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ, సోంతూరి బాట పడుతున్నారు.

