త్వరలోనే కాశ్మీర్‌గడ్డ కమ్యూనిటీ హాల్ ప్రారంభం: సునీల్ రావు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని కాశ్మీర్‌గడ్డ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్‌(Kashmirgadda Community Hall) ను త్వరితగతిన పూర్తి చేసి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు తెలిపారు. శనివారం కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన గడప పూజా మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన భవనం ప్రవేశ ద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేదమంత్రాల నడుమ గడపను దాటి భవనంలోకి ప్రవేశించిన అనంతరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సునీల్ రావు (Deputy Mayor Yadagiri Sunil Rao) మాట్లాడుతూ.. కాశ్మీర్‌గడ్డ ప్రాంత ప్రజలకు ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థానికులకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. భవనంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంతో పాటు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత సమయంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>