వైద్యం పేరుతో మహిళను వేధించిన డాక్టర్ అరెస్ట్

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించిన ఓ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. వైద్యం పేరుతో తనను వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చుంచుపల్లి పోలీసులు.. వైద్యుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ​కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ నాడికూడి శైలేశ్ కుమార్ (39) వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇదే ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS)తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం విద్యానగర్ కాలనీ సమీపంలో నిందితుడు డాక్టర్ శైలేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపర్చగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>