కలం, కరీంనగర్: విజయదశమి (Vijayadashami) పండుగను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర పండుగ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) సందర్శించి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను యాదగిరి సునీల్ రావు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ నగరంలోని పలు మండపాల వద్ద నిర్వహించిన జమ్మి పూజ (శమి పూజ) కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. భక్తులకు, ప్రజలకు జమ్మి ఆకులను ఆప్యాయంగా పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శమి పూజలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి కదిలించారు. అలాగే కాశ్మీర్ గడ్డ ఫండస్ స్కూల్ వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారి మండపంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న పవిత్ర కలశాన్ని స్వీకరించారు.
భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జమ్మి పూజలో సునీల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజలందుకున్న కలశాన్ని స్వీకరించి, అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి సాగనంపారు. హెలిపాడ్ గ్రౌండ్లోని శ్రీ హనుమాన్ టెంపుల్లో జరిగిన జమ్మి పూజలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. భగత్ నగర్ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన చివరి పూజలో పాల్గొని కలశాన్ని స్వీకరించారు. అలాగే పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో పెద్దమ్మ యూత్ ఆధ్వర్యంలో శమి పూజలు నిర్వహించి, అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమాల్లో మండప నిర్వాహకులు, కాలనీవాసులు, బీజేపీ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

