కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన దాసరి మమతా రెడ్డి, ప్రశాంత్ రెడ్డి

కలం, పెద్దపెల్లి: ఇటీవల గోదావరిఖనిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సింగరేణి సింహ గర్జన’ బహిరంగ సభ ఘన విజయం సాధించడంపట్ల పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి (Dasari Mamatha Reddy), బీఆర్ఎస్ నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి గార్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సభ దిగ్విజయమైనందుకు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా కేటీఆర్, సింగరేణి సింహ గర్జన సభ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన దాసరి ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విశేష కృషి చేసి సభను విజయవంతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

​పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నాయకులు, కార్యకర్తలు చూపిస్తున్న ఐక్యత, నిబద్ధత ఎంతో అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>