‘సర్‌’తో ప్రజాస్వామ్యంపై దాడి: బీవీ రాఘవులు

కలం, చౌటుప్పల్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రజాస్వామ్యంపై దాడి అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు (BV Raghavulu) ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రక్రియలా కాకుండా, ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందేలా బీజేపీ ప్రభుత్వం వినియోగించుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సింది పోయి, బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే సాధనంగా సర్ దుర్వినియోగమవుతోందని విమర్శించారు.

ఈసారి చర్చ జరుగుతోంది..

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో బీవీ రాఘవులు పాల్గొని మాట్లాడారు. సర్ నిజంగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియే అయినప్పటికీ, గతంలో ఇంత తీవ్ర రాజకీయ చర్చలు, ప్రజల్లో ఆందోళనలు కనిపించలేదని రాఘవులు అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో చివరిసారిగా 2002లో సమగ్ర సవరణ జరిగిందని, పదేళ్లకోసారి జరగాల్సిన ప్రక్రియ ఆలస్యంగా ఇప్పుడు చేపట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గాల పునర్విభజనపై..

కొత్త ఓటర్ల నమోదు, ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహించడం ఎన్నికల సంఘం సాధారణ విధానమే అయినా.. ఈసారి సర్‌పై అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని బీవీ రాఘవులు పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా ఎన్నికల లబ్ధికి అనుకూలంగా వినియోగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

బీజేపీకి అనుకూల ప్రాంతాలను ఒకే నియోజకవర్గంగా మార్చడం, ప్రతిపక్షాలకు బలం ఉన్న ప్రాంతాలను విభజించడం ద్వారా ఎన్నికల సమీకరణాలను మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాష, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య, కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు రాయగిరి కిష్టయ్య, సిరిపంగి స్వామి ,అవ్వారు రామేశ్వరి, బొడ్డుపల్లి వెంకటేష్, మద్దెల రాజయ్య, దూడ యాదిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>